కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్

V6 Velugu Posted on Sep 18, 2021

రాష్ట్రంలో  డ్రగ్స్ నిర్మూలన కోసం  వైట్ ఛాలెంజ్ ప్రకటిస్తున్నానన్నారు పీసీపీ చీప్ రేవంత్ రెడ్డి. ఇందు కోసం తన బ్లడ్ ,వెంట్రుకల శాంపిల్స్ ను డాక్టర్లకు ఇస్తానన్నారు.  ఎంపీ సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ లా .. తాను వైట్ ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వైట్ ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. వాళ్లిద్దరు తన ఛాలెంజ్ స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్ చేయాలన్నారు రేవంత్. రాష్ట్రం డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసమే ఈ వైట్ ఛాలెంజ్ అన్నారు. 

బండి సంజయ్ ఢిల్లీలో చెప్తే వినరని.. రాష్ట్రంలో చెబితే నమ్మరని అన్నారు.  బీజేపీ రిమోట్ కేసీఆర్ చేతుల్లో ఉందన్నారు. 8 ఏళ్లైనా బీజేపీ ఇప్పటి వరకు పునర్విభజన చట్టంపై మాట్లాడలేదన్నారు. బీజేపీ నేతలకు రాంజీగోండు చరిత్ర తెల్వదన్నారు. గోండుల పట్ల ఆదివాసుల పట్ల బీజేపీ నేతలకు చిన్న చూపన్నారు రేవంత్. అందుకే పేపర్ ప్రకటనలో సోయం బాపూరావ్ ఫోటో వేయలేదన్నారు.

Tagged Revanth reddy, White Challenge, Drug telangana

Latest Videos

Subscribe Now

More News