అధికారంలోకి రాగానే రైతుల బాధ్యత మాదే

అధికారంలోకి రాగానే రైతుల బాధ్యత మాదే

తెలంగాణ అంటే తమకు ఓట్లు రాల్చే నినాదం కాదు.. పేగు బంధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆయన.. ఓరుగల్లు పేరు వింటేనే ఉద్యమం గుర్తొస్తదని చెప్పారు. వేలాది రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని రేవంత్ ఆరోపించారు. 365 రోజుల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేసిన ఆయన.. పాలనాపగ్గాలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీ రైతుల సంపూర్ణ బాధ్యత తీసుకుంటుదని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. అందులోని అంశాలను పరిశీలిస్తే..

 • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ 
 • ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద రైతులందరికీ (కౌలు రైతులు సహా) ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం
 • ఉపాధి హామీ పథకంలో నమోదైన రైతు కూలీలకు ఏటా 12వేల ఆర్థిక సాయం
 • రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి చివరి గింజ వరకు కొనుగోలు 
 • మూతబడ్డ చెరుకు కర్మాగారాలను తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు
 • పంటల బీమా పథకం ద్వారా పరిహారం, భూమిలేని రైతులకు రైతు బీమా పథకం వర్తింపు
 • ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించడం
 • పోడు భూములపై ఆదివాసీలకు యాజమాన్య హక్కు
 • అసైన్డ్ భూములపై దళితు, గిరిజనులకు హక్కు 
 • రైతులకు శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు
 • అన్ని వర్గాల వారి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ
 • నకిలీ విత్తనాల పురుగు మందుల నియంత్రణకు కఠిన చట్టం
 • అవినీతికి ఆస్కారం లేకుండా పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి 
 • రైతు సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ ఏర్పాటు