పుట్టిన రోజు మోజులో పడి కేటీఆర్​ ప్రజలను మర్శిండు : రేవంత్​ రెడ్డి ట్వీట్​

పుట్టిన రోజు మోజులో పడి కేటీఆర్​ ప్రజలను మర్శిండు : రేవంత్​ రెడ్డి ట్వీట్​

హైదరాబాద్​లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ట్వీట్టర్​ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్​ రెడ్డి విమర్శించారు.  ‘‘సీఎం కేసీఆర్​, మున్సిపల్​ మంత్రి కేటీఆర్​ వర్షాల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. పుట్టిన రోజు మోజులో పడి కేటీఆర్​ జనాలను మరిచిపోయిండు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదు. తీవ్ర వర్షాల నేపథ్యంలో రాష్ర్టంలో ఇప్పటికే వాతావరణ శాఖ అలెర్ట్​ ప్రకటించింది. అయిన కూడా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు.  

ట్రాఫిక్​ కారణంగా గంటల తరబడి ప్రజలు రోడ్లపైనే ఉంటున్నారు. హైదరాబాద్​ని డల్లాస్​, ఓల్డ్​ సిటీని ఇస్తాంబుల్​ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్​, కేటీఆర్ లు నగరాన్ని నరక కూపంగా మార్చారు’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  కాంగ్రెస్​ శ్రేణులు ప్రజలకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మేలు జరిగేలా చూడాలన్నారు.  బుధ, గురు వారాల్లో ప్రభుత్వం జనాలకు సరైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్​ చేశారు. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్​ ఆధ్వర్యంలో గ్రేటర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని ఆయన హెచ్చరించారు.