బాసర ట్రిపుల్ ఐటీకి రేవంత్

బాసర ట్రిపుల్ ఐటీకి రేవంత్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇవాళ వరుసగా నాలుగవ రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దుతు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాసరకు బయలుదేరారు. విద్యార్థులకు అండగా బాసరకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, స్వయంగా తానే ఆందోళనలో పాల్గొంటానని రేవంత్ ప్రకటించారు. బాసరలో విద్యార్థులను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రేవంత్  వెల్లడించారు. విద్యార్థులున్న క్యాంపస్ లో నీళ్లు, కరెంట్ నిలిపివేయడం రాక్షసత్వమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. - మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించి డ్రామాలు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తారా లేదా?  స్పష్టంగా ప్రకటించాలని రేవంత్ ప్రశ్నించారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని మంత్రి సబిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు రేవంత్.  

అటు  ట్రిపుల్ పుల్ ఐటీ ఇష్యూ మీద నిన్ననే స్పందించిన రాహుల్ గాంధీ... విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -  విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీ అనడం తెలంగాణ భవిష్యత్ పట్ల కేసీఆర్ ప్రభుత్వ విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మర్చిపోయాడంటూ రాహుల్ ట్వీట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో దయనీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు రాహుల్.