
సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధాన్యం అమ్ముకోలేక అన్నదాత వడ్ల కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నా ప్రభత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. ఈ విషయంపై శనివారం ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.. "అయ్య కేసీఆరేమో రైతు పక్షపాతట. కొడుకు కేటీఆరేమో సాంకేతిక నిపుణుడట. కానీ, ధాన్యం అమ్ముకోలేక వడ్ల కుప్పల పై రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. ధరణి సమస్యల వలయంలో చిక్కి ఎకరం, అరెకరం అమ్ముకోలేక అన్నదాతలు ఉసురు తీసుకుంటున్నారు. ఇది ఆ ఇద్దరి పాపం కాదా!?" అంటూ ట్వీట్ చేశారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య.. 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే.. ఇక, వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి. తర్వాత మృతడి కొడుకు మాట్లాడిన రేవంత్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు అధైర్య పడవద్దు అని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
ధాన్యం అమ్ముకోలేక వారం రోజులు పడిగాపులు పడి వడ్ల కుప్పపైనే ప్రాణాలు వదిలిన కామారెడ్డి జిల్లాకు చెందిన బీరయ్య కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన పీసీసీ అధ్యక్షుడు @revanth_anumula pic.twitter.com/yGQYaUKxnS
— Telangana Congress (@INCTelangana) November 6, 2021