రెండుసార్లు అధికారం ఇచ్చినా..కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదు : రేవంత్రెడ్డి

రెండుసార్లు అధికారం ఇచ్చినా..కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదు : రేవంత్రెడ్డి

రెండు సార్లు అధికారం వచ్చినా సీఎంకేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే.. వారి తల్లుల కడుపు  కోతను చూడలేక సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు రేవంత్ రెడ్డి. ఏ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఆరు గ్యారంటీలను సోనియాగాంధీ ప్రకటించారు అని రేవంత్ రెడ్డి అన్నారు.  

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు రేవంత్ రెడ్డి..  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే బీఆర్ ఎస్ ను ఓడించాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..కేసీఆర్ జీవితకాలం ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మహిళలకు రూ. 2వేల500 ప్రతినెలా బ్యాంక్ ఖాతాలే వేస్తామన్నారు రేవంత్ రెడ్డి.రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి యేటా రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. 12వేలు ఇస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు రేవంత్ రెడ్డి.