కేసీఆర్కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

కేసీఆర్కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇవ్వకుంటే.. నాంపల్లి దర్గా, బిర్లామందిర్ మెట్లపై కేసీఆర్ కుటుంబం అడ్డుక్కుతినేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని తెలిపారు.

2004లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రబ్బరు చెప్పులు వేసుకొని తిరుగుతున్న హరీష్​ రావును ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసి.. హరీష్​ రావుకు బతుకునిచ్చిందే ఇందిరమ్మ రాజ్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.. కేటీఆర్, హరీశ్ లను మొదట మంత్రిని చేసింది ఇందిరమ్మ రాజ్యమేనని వివరించారు. కేసీఆర్ చదువుకున్న బడులను కూడా కాంగ్రెసే కట్టిందని తెలిపారు. 

నాగం, మర్రిని తరిమికొట్టండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరును కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. డిసెంబర్ 9, 2023న.. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. దొరల రాజ్యాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆకలిని చంపుకుంటాం కానీ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కుట్రలు చెల్లవని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని మళ్లీ తీసుకువస్తామన్నారు. కంప్యూటర్ తెచ్చింది.. ఐటీ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, మెట్రో, గోదావరి, కృష్ణ నీళ్లు తెచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని తెలిపారు.

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరతామని రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. ఎక్కడికి వెళ్లినా ఫ్రీ అని తెలిపారు. పాలమూరు జిల్లాలో మొత్తం సీట్లు గెలవబోతున్నాం.. వంద సీట్లతో కాంగ్రెస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో రేవంత్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.