అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరివాడు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ట్వీట్‌‌‌‌‌‌‌‌

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరివాడు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ట్వీట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతి వేడుకలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న అంబేద్కర్​ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘‘అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరి వాడని, భారతావానిలో ఉదయించిన భాస్కరుడు’’అని ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఒక వర్గాన్ని ఇంకో వర్గంపైకి ఉసిగొలిపే ధోరణి చాలా ప్రమాదకరమన్న అంబేద్కర్ మాటలను గుర్తుచేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంటరానితనం విముక్తి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.

దేశ చరిత్రలో నిలిచారు: గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్​

రాజ్యాంగాన్ని రచించి దేశ చరిత్రలో అంబేద్కర్ నిలిచిపోయారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గవర్నర్ నివాళి అర్పించారు. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పొందాలని రాజ్యాంగంలో ఆయన పేర్కొన్నారన్నారు. సామాజిక న్యాయం, ఫెడరలిజం సూత్రాలను తెలంగాణ, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. 

సమానత్వపు హక్కు అమలు కావట్లే: కోదండరాం

రాజ్యాంగంలో అంబేద్కర్ పేర్కొన్నట్టు సమానత్వపు హక్కు అమలు కావడం లేదని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. 40 శాతం దేశ సంపద 160 మంది బిలియనీర్ల చేతిలో ఉందన్నారు. ఇదే ఇలాగే కొనసాగితే అంబేద్కర్ కోరుకున్న సమానత్వపు హక్కుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలు రూపుమాపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండాలని అంబేద్కర్ సూచించారని వివరించారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని కోదండరాం వ్యాఖ్యానించారు. మరోవైపు, కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుతో పాటు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.