కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే.. సీబీఐతో విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి

కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే.. సీబీఐతో విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి

కాళేశ్వరంలో ప్రాజెక్ట్ ను స్వయంగా నేనే డిజైన్ చేసినట్టు కేసీఆర్ చెప్పారన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై గతంలో అసెంబ్లీలో సీఎం పెద్ద పెద్ద స్పీచ్ లు ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అని సీఎం గొప్పలు చెప్పుకున్నారని తెలిపారు. 

కాళేశ్వరంలో ఇంత ఉపద్రవం జరిగినా కేసీఆర్ మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి పూర్తిగా బట్టబయలు అవుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.

డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించదని ప్రశ్నించారు. దీనిపై CBI తో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

Also Read :- డిగడ్డ ప్రాజెక్టు వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించాలి

పిల్లర్లు కుంగగానే బీఆర్ఎస్ ప్రభుత్వం టెక్నికల్ సమస్య అని తప్పించుకుంటోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. నిర్మాణాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది.. బాధ్యతలపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు. 

మేడిగడ్డ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయట పెట్టిందని వ్యాఖ్యానించారు. 6 నెలలో కాంట్రాక్ట్ సంస్థ వ్యారెంటీ పూర్తవుతుందని.. కేంద్ర కమిటీ అడిగిన అంశాల్లో తొమ్మిదింటికి వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. 

కేసీఆర్ దనదహానికి మెడిగడ్డ కుంగిందని.. కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆలోచనలు మారి.. ఆశలు పెరిగాయన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అనే పదం కనిపెట్టారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. 

నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాచారం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ ఇతర పార్టీల గొప్పతనం ఒప్పుకోలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి ఎలా అయిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని నిలదీశారు. కమిషన్లు దోచుకోవడానికి కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారని రేవంత్ రెడ్డి అన్నారు.