మేడిగడ్డ ప్రాజెక్టు వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించాలి: కిషన్రెడ్డి

మేడిగడ్డ ప్రాజెక్టు వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించాలి: కిషన్రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి:మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ ని సందర్శించారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడుకిషన్రెడ్డి. కుంగిపోయిన బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.

Also Read :- మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ సందర్శించిన కిషన్రెడ్డి

ఇటీవల డ్యాం సేఫ్టీ అధికారుల బృందం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరితే 11 మంది అంశాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చారు.. డ్యాం నిర్మాణంలో చాలా లోపాలున్నాయి. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 

కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో వేలకోట్లు  దుర్వినియోగం అయ్యాయి.. ముఖ్య మంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.  రూ. లక్ష కోట్ల అప్పులు చేసిన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే సిబిఐతో విచారణ జరుపుతామన్నరు కిషన్ రెడ్డి. నాణ్యత,నిర్మాణ లోపం కేసీఆర్ అవినీతి తో మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు ఏర్పడి దెబ్బతిన్నది..ఈ ఘటన తెలియడంతోనే కేంద్ర జలశక్తి నిపుణులకు లేఖ రాశామన్నారు. జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి చాలా తీవ్రమైన అంశాలు అందులో పొందుపరిచారు..మెడిగడ్డ లాగానే అన్నారం బ్యారేజీ పరిస్థితి అలానే ఉంది.బ్యారేజి పిల్లర్స్ కుంగి పోయి ప్రమాదకరంగా తయారైందన్నారు కిషన్ రెడ్డి. 

సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి,నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణచడంతో ఈ దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకి ప్రాజెక్టు గుదిబండగా మారిందన్నారు. రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే పదహేను నిమిషాలలో సీబీఐ దర్యాప్తుకు అంగీకరిస్తామన్నారు కిషన్ రెడ్డి. రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారు..తెలంగాణ ప్రభుత్వానికి గొప్పతనం  వస్తే తమదని దుస్థితి వస్తె కేంద్రం పై నిందలు వేయడం పై సిగ్గుపడాలని కిషన్ రెడ్డి విమర్శించారు. డ్యాం సేఫ్టీ అధికారులు 20 అంశాల పై డాటా అడిగితే  11అంశాల పై సమాచారం ఇచ్చింది.. ముఖ్య మంత్రి కేసీఆర్ ముక్కు నెలకు రాసి ప్రజలకు క్షమాపణ కోరాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.