మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ సందర్శించిన కిషన్రెడ్డి

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ సందర్శించిన కిషన్రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ ని సందర్శించారు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్రెడ్డి.ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఇతర బీజేపీ నేతలతో కలసి ప్రత్యేక హెలీకాప్టర్లో మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకున్నారు. ఇటీవల మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రాజెక్టు లోపాలను రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి బ్యారేజ్ పరిశీలించేందుకు మేడిగడ్డకు సందర్శించారు. కిషన్ రెడ్డితోపాటు మంథని, భూపాలపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు.   

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లర్ల కుంగుబాటుతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. ఇటీవల డ్యాం సేఫ్టీ అధికారుల బృందం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరితే 11 మంది అంశాలకు సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చారు.. డ్యాం నిర్మాణంలో చాలా లోపాలున్నాయి. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 

Also Read :- మందు ప్రియులకు షాక్

ఇటీవల కుంగిన మేడిగడ్డ( లక్ష్మీ) బ్యారేజీను కేంద్ర కమిటీ పరిశీంచింది. CWC సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ డ్యా్మ్ ను పరిశీలించారు. ఈ బృందంతో పాటుగా  రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఇంజనీర్లు కూడా ఉన్నారు.  బ్యారేజీ పటిష్టత,  జరిగిన నష్టంపై  కేంద్ర బృందం అంచనా వేసి నివేదిక తయారు చేశారు.