జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు BJP, TRS కుట్ర: రేవంత్

జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు BJP, TRS కుట్ర: రేవంత్
  • తెలంగాణలో యాత్ర ముగియనున్న సందర్భంగా 7న జుక్కల్​లో రాహుల్ సభ ఏర్పాటు
  • జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేశాయన్న రేవంత్
  •  సభ ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించిన కాంగ్రెస్ నేతలు
కామారెడ్డి/ నిజాంసాగర్/ పిట్లం, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్​ఎస్​ కుట్ర చేశాయని పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరమీదికి తెచ్చి, జోడో యాత్రపై మీడియాలో ప్రయార్టీ లేకుండా చేసేందుకు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. అయినా రాహుల్ యాత్రకు మీడియాలో, జనంలో మంచి స్పందన వచ్చిందని చెప్పారు. తెలంగాణలో రాహుల్ యాత్ర ఈ నెల 7న  ముగియనున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గం మేనూరులో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర నేతలు నిజాంసాగర్​లో భేటీ అయ్యారు. రేవంత్​తో పాటు సీఎల్పీ నేత  భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాకూర్, షబ్బీర్​అలీ, పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణపై పార్టీ నేతలు చర్చించారు. అనంతరం రూట్ మ్యాప్​తో పాటు సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు.
 
జుక్కల్ నుంచి మహారాష్ట్రలోకి యాత్ర
సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర ఈ నెల 6 న రాత్రి కామారెడ్డి జిల్లాలోకి ఎంట్రీ కానుంది. ఆ రాత్రి పెద్దకొడప్​గల్​ వద్ద రాహుల్​ బస చేస్తారు. 7న ఉదయం జుక్కల్​ నుంచి రాష్ట్ర బార్డర్​దాకా యాత్ర కొనసాగుతుంది. మధ్యలో మేనూర్​ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 7న రాహుల్ యాత్ర తెలంగాణలో ముగిసి మహారాష్ట్రలోకి ఎంట్రీ అవుతుంది”అని మీటింగ్ తర్వాత రేవంత్ మీడియాతో చెప్పారు. 15 రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన జోడో యాత్రలో రాహుల్ పరిశీలించిన అంశాలు సభలో వివరిస్తారని చెప్పారు. తమ సమస్యలను జర్నలిస్టులు రాహుల్​దృష్టికి తీసుకెళ్లవచ్చని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి రాహుల్ యాత్ర దోహదపడుతుందన్నారు. 7 న జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.