రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ ఓడిపోయింది

రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ ఓడిపోయింది

పాలమూరు- రంగారెడ్డికి ఎన్జీటీ అనుమతి ఎందుకు సాధించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్. కృష్ణా ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లాయన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే పాలమూరు ప్రాజెక్టు ఆగిందన్నారు. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారన్నారు.అందుకే జగన్  అక్రమ ప్రాజెక్టు అని  కోర్టుకెళ్లారన్నారు. కల్వకుర్తి కూడా మూలకు పడే పరిస్థితి వచ్చిందన్నారు.  మళ్లీ  పాలమూరు ప్రజలు వలస వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ ఓడిపోయిందన్నారు. ఎన్జీటిలో ఓ సామాన్యుడు చేసిన వాదనలు ముందు తెలంగాణ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు.
 

ప్రజలకంటే కుటుంబానికే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తారన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సెక్రటేరియల్ ను రాత్రిరాత్రికి కూల్చారన్నారు. కేటీఆర్ ను సీఎంను చేసేందుకే సెక్రటేరియేట్ ను కూల్చారన్నారు. రాత్రిపూట ఫ్లడ్ లైట్ ల మధ్య సెక్రటేరియేట్ నిర్మాణం జరుగుతుందన్నారు. కేసీఆర్ కు పాలమూరు రైతుల ఉసురు తగులుతుందన్నారు. జూరాల కట్టమీద కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదు. లేకపోతే  లక్షలాది పాలమూరు రైతుల సమక్షంలో శ్రీశైలం గట్టుమీద ఉరి తీసినా తప్పులేదన్నారు. ఉరితీయడమే గాకుండా కేసీఆర్ ను రాళ్లతో కొట్టాలన్నారు.  కిషన్ రెడ్డి, బండిసంజయ్ పది రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు  ఇప్పించాలన్నారు. లేకపోతే తమ ప్రాంతాల్లో తిరగనీయమన్నారు.

కేసీఆర్, జగన్ కవలపిల్లల్లా పనిచేస్తున్నారన్నారు. 2017 నుంచే ఇద్దరు ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆలోచనగా కేసీఆర్, జగన్ వ్యూహాత్మకంగా పాచికలు కదిలిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షమవడం చూస్తుంటే..మళ్లీ రెండు రాష్ట్రాలను కలపాలనే కుట్ర జరుగుతోందన్నారు.  కేసీఆర్ అధికారంలోకి రావడానికి శవాలు పునాదులుగా మారాయన్నారు. అమ్మ తెలంగాణ తల్లి, చిన్నమ్మ తెలుగుతల్లి అని కేసీఆర్ చెప్పి ఉంటే తమకేం అభ్యంతరం లేదన్నారు. జగన్ జైలుకు వెళుతాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందన్నారు.