హుజురాబాద్ ఎన్నికలతో ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్

హుజురాబాద్ ఎన్నికలతో ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్

కేసీఆర్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచారని అన్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందన్నారు. అందుకే..7ఏళ్లు ఫామ్ హౌస్ పాలన చేసిన ఆయన.. హుజురాబాద్ ఎన్నికలతో బయటికొచ్చిండన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్..కేసీఆర్ ప్రవర్తన మారిందన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడే విధానం మారిందన్నారు. ఎలక్షన్ కు ముందు ఏడాది చేయాల్సిన పనులన్నీ ఈ ఏడాదిలోనే చేస్తాడని తెలిపారు.

నవంబర్ 15న TRS సభ వుంటే.. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. ఈ రెండు సభలే కొలమానమని..కాంగ్రెస్ ఆక్టివిటీ పెరగడంతో కేసీఆర్ భూమ్మీదకు వచ్చిండన్నారు. అంతేకాదు..రానున్న రోజుల్లో మోకాళ్ళ మీదకు వస్తారన్నారు. బీజేపీకి  2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19 శాతం ఓట్లు వచ్చాయని..మాకు 29.5 శాతం ఓట్లు పడ్డాయని చెప్పారు. మేం ముగ్గురం ఎంపీలుగా  గెలిచిన చాలా చోట్ల.. కాంగ్రెస్ అభ్యర్థులు సెకండ్ ప్లేస్ లో వున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి.