కోదండరాంపై విమర్శలు చేసే ఊరుకోం: రేవంత్ రెడ్డి

కోదండరాంపై విమర్శలు చేసే ఊరుకోం: రేవంత్ రెడ్డి

కోదండరాంపై విమర్శలు చేసే స్థాయి ఎవరికీ లేదన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.   కోదండరాంపై విమర్శలు  గురించి విమర్శలు చేస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించారు.   కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారంటూ వ్యాఖ్యానించారు రేవంత్. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు  బుద్ధి తెచ్చుకోవాలన్నారు.  కోదంరాం ఈ  ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.. 

కేసీఆర్ అవినీతికి కేంద్రం సహకరిస్తోంది

కాళేశ్వరంలో ప్రాజెక్ట్ ను స్వయంగా తానే డిజైన్ చేసినట్టు గతంలో కేసీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై గతంలో అసెంబ్లీలో సీఎం పెద్ద పెద్ద స్పీచ్ లు ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని సీఎం గొప్పలు చెప్పుకున్నారని తెలిపారు. కాళేశ్వరంలో ఇంత ఉపద్రవం జరిగినా కేసీఆర్ మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి పూర్తిగా బట్టబయలు అవుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.

డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించదని ప్రశ్నించారు. దీనిపై CBI తో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ALSO READ :- Women Special : ప్రేమ, బ్రేకప్ అంతా ఈ హార్మోన్ల వల్లనే...