తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు:రేవంత్​ రెడ్డి

తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు:రేవంత్​ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత కు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. అమరవీరుల బలిదానాలకు చంద్ర గ్రహణంలా దాపురించిన కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. త్యాగాలు చేసిందెవరు..భోగాలు అనుభవిస్తోందెవరనేది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసన్నారు. అధికార మదంతో మూసుకుపోయిన కేసీఆర్​ కుటుంబ సభ్యుల కళ్లకు, చెవులకు తెలంగాణ ఘోష కనబడవు..వినబడవు అన్నారు. 

వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే..బతుకమ్మ ఆడినందుకే..బోనం కుండలు ఎత్తినందుకే ..మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి అని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు.