కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలోనూ గెలుస్తం: రేవంత్

కర్ణాటకలో గెలిస్తే  తెలంగాణలోనూ గెలుస్తం: రేవంత్

కర్ణాటకలో  కాంగ్రెస్ గెలుపు ఖాయమని,అక్కడ కాంగ్రెస్ వస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ బోయినపల్లి రాజీవ్ గాంధీ, ఐడియాలజీ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు.  కర్ణాటకలో బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పనిచేసిండన్నారు. జేడీఎస్ తో కలిపి బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలిపారు.

కుమార స్వామి సింగపూర్ లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చక్రం తిప్పేపనిలో ఉన్నారని చెప్పారు. కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు రేవంత్.  బీజేపీ ,బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. కర్ణాటకలో తెలుగు ఓటర్లు ప్రభావితం చేసే సెగ్మెంట్లు 78 వరకు ఉన్నాయని.. మరి ఆ సెగ్మెంట్ల ప్రజలకు బీజేపీని ఓడించమని కేసీఆర్ ఎందుకు పిలుపునివ్వలేదని ప్రశ్నించారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఐడియాలజీ ట్రైనింగ్ సెంటర్ గా మారబోతుందన్నారు. 365 రోజులు సెంటర్ పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే లీడర్లు ఇక్కడ శిక్షణ తీసుకుంటారన్నారు.