నాయకత్వానికి బ్రాండ్ ఎన్టీఆర్.. నేను ఆ లైబ్రరీలోనే చదువుకున్న: సీఎం రేవంత్

నాయకత్వానికి బ్రాండ్ ఎన్టీఆర్.. నేను ఆ లైబ్రరీలోనే చదువుకున్న: సీఎం రేవంత్

 

  • కమ్మ అంటేనే అమ్మలాంటి ఆప్యాయత
  • హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కండి
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని, ఎంతో మందికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎన్టీఆర్ లైబ్రరీలోనే చదువుకున్నానని చెప్పారు. తమను ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఆయన నాయకత్వమేనని చెప్పారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు బాటలు వేసింది ఎన్టీఆరేనని చెప్పారు. ఆయన వల్లే చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయని చెప్పారు. ఇవాళ హెచ్ఐసీసీలో నిర్వహించిన కమ్మ గ్లోబల్ సమ్మిట్‌ను సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

 కమ్మ సామాజిక వర్గం తనను ఎంతగానో అభిమానిస్తుందని చెప్పారు. కమ్మ అంటేనే కష్టపడే తత్వం ఉన్నవారని అర్థమన్నారు. అమ్మలాంటి ఆప్యాయత కమ్మ వారిలో ఉంటుందన్నారు. నేను నమ్ముకొని కష్టించి పనిచేస్తారని అన్నారు కష్టపడటం.. పది మందికి సాయపడటం కమ్మ వారి లక్షణమని అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. తమకు భేషజాలు లేవని, కమ్మవారిని అభిమానిస్తామని, ఇతర కులాలనూ గౌరవిస్తామని సీఎం చెప్పారు. తెలంగాణలో ఎవరిపైనా వివక్ష ఉండదని తెలిపారు.

 ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం హక్కు అని నిరసన తెలుపకుండా నియంత్రించాలనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూశారని పరోక్షంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎం గుర్తు చేశారు. వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు