ఎమ్మెల్యే వల్ల దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకుండు: రేవంత్

ఎమ్మెల్యే వల్ల దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకుండు: రేవంత్

మానుకొండూరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు పేరు బంధం ,పేగుబంధం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మానుకొండూరు ప్రాంతాన్ని దోచుకుంటూ..  దొరలకంటే తానేం తక్కువ కాదన్నట్టు ఫాంహౌస్ కట్టుకున్నాడని విమర్శించారు.  రసమయి  అక్రమాలపై  ప్రశ్నిస్తే  అట్రాసిటీ కేసులు, అక్రమ కేసులు పెట్టి   వేధిస్తున్నాడని ఆరోపించారు. పరాయివాడు కాబట్టే..ఇక్కడి ప్రజలపై కేసులు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వల్ల దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకుండని ఆరోపించారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ధరణి దందాలపై విచారణ చేపట్టి..ధరణి పోర్టల్  ను రద్దు చేస్తామని రేవంత్ అన్నారు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ఏం చేసిందో.. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఏం చేసిందో చర్చించడానికి రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.  ఇపుడు డ్రామారావు సెల్ఫీలు దిగుతున్న శిల్వారామం కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిందేనని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుందని రేవంత్ అన్నారు.