రానా, రకుల్ ను తప్పించడానికి ప్రయత్నించిందెవరు?

V6 Velugu Posted on Sep 18, 2021

డ్రగ్స్ కేసు నుండి రానా, రకుల్ ప్రీతి సింగ్ ను తప్పించడానికి ప్రయత్నించిన వారెవరని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బెంగుళూర్ లో డ్రగ్స్ విచారణ చేస్తుంటే.. ఇక్కడి టీఆరెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారన్నారు. సర్కార్ నిర్లక్ష్యంతోనే స్కూళ్లల్లో, కాలేజీల్లో, పబ్ లల్లో డ్రగ్స్ విచ్చల విడిగా వాడుతున్నారని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు వైట్ ఛాలెంజ్ లో భాగంగా అక్కడికి వస్తా అన్నారు. మీరు సిద్ధమా..నేను సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులను కోరుతున్నా. ప్రొహిబిషన్ అండ్ ఎక్స్ జ్ శాఖ.. రానా, రకుల్ కు నోటీసులు ఇవ్వాలి కానీ.. ఈడీ వారిని పిలిచి విచారిస్తుంది. దాని వెనుకున్న రహస్యమేంటన్నారు. గజ్వేల్ సభ సెక్సెస్ కావడంతోనే కేటీఆర్ బయటికొచ్చి మాట్లాడుతుండని.. అధికారంలో ఉన్నప్పుడు అన్ని అందంగానే కనిపిస్తాయన్నారు. కేటీఆర్ చదువుకుంది.. గుంటూరు, పూణే, అమెరికా.. ఆయనకు తెలంగాణ సంస్కృతి ఏం తెలుసని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
 

Tagged KTR, Revanth reddy, Drugs Case, rana, Rakul,

Latest Videos

Subscribe Now

More News