
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి 65 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు గవర్నర్ తమిళిసై కలిశారు. అభ్యర్థులు జాబితాను గవర్నర్ కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కోరారు.
ఈ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 4న ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహిస్తాం.. అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.