మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలుపు

మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలుపు

రంగారెడ్డి జిల్లా మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధి రేవంత్ రెడ్డి ఘ‌న‌విజ‌యం సాధించారు.. ఆయ‌న త‌న స‌మీప టిఆర్ఎస్ అభ్య‌ర్ధి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పై సుమారు 6 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. ఫలితాల సరళి కూడా అదే రకంగా వచ్చాయి. రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య చివరి రౌండ్ వరకు గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. అయితే చివరి రౌండ్ వరకు స్వల్ప అత్యధికను ప్రదర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డిని అఖరి రౌండ్‌లో విజయం వరించింది.

ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సొంతం చేసుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి విజయం పెద్ద షాక్ ఇచ్చినట్టయ్యింది.