ఇద్దరు తెలంగాణను కొల్లగొడ్తున్నరు

ఇద్దరు  తెలంగాణను కొల్లగొడ్తున్నరు
  •     ప్రాజెక్టుల డిజైన్లు మార్చి ప్రజల నడ్డి విరిచారన్న పీసీసీ చీఫ్
  •     పరిగిలో మన ఊరు.. మన పోరు బహిరంగ సభ

వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదవులను కేసీఆర్, నీళ్లను జగన్, నిధులను మేఘా కుటుంబం కొల్లగొడ్తున్నారని, అభివృద్ధి పేరుతో తెలంగాణను కబంధ హస్తాల్లో బంధిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ ​అయ్యారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన అని చెప్పిన చేవెళ్ల చెల్లెమ్మ.. వికారాబాద్​ జిల్లాను ఎందుకు డెవలప్​ చేయడం లేదని ప్రశ్నించారు. శనివారం పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన ‘మన ఊరు..- మన పోరు’బహిరంగ సభలో రేవంత్​ మాట్లాడారు. చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి దేశమంతా గుడ్లు అమ్ముతాడు కానీ ఈ ప్రాంత ప్రజలకు గుక్కుడు మంచినీళ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పరిగి ఎమ్మెల్యే గుడి మాన్యాలను, గుడిలో ఉన్న లింగాలను మింగే వ్యక్తగా మారారని విమర్శించారు. తాండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్​లో గెలిచి టీఆర్ఎస్​లోకి వెళ్లాడని మండిపడ్డారు. వీళ్ల తోటి జిల్లాకు పాలమూరు నీళ్లు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చి వికారాబాద్ జిల్లా ప్రజల నడ్డి విరిచిండ్రని మండిపడ్డారు. అభివృద్ధి కోసం పార్టీ మారానన్న చేవెళ్ల చెల్లెమ్మ జిల్లాకు నీళ్లు రాకపోతే ఎందుకు అడగడం లేదన్నారు. పార్టీ మారితే ప్రాంతం అభివృద్ధి చెందిందో.. లేదా మీరు డెవలప్​అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్​కుటుంబం రెండుసార్లు సీఎం అయ్యారని, నీళ్లు జగన్​మోహన్​రెడ్డి, నిధులు మెఘాఫ్యామిలీ పోతున్నాయని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. వడ్లు కొనకపోతే కేసీఆర్ ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని రేవంత చెప్పారు. ప్రభుత్వం అవినీతి అధికారులను తయారు చేస్తోందన్నారు.

కలెక్టర్ ​అవినీతి పరుడు: గడ్డం ప్రసాద్​ కుమార్

వికారాబాద్ కలెక్టర్ పట్టా మార్పిడి చేయడానికి ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్​ కుమార్​ ఆరోపించారు.అనంతగిరి ని ఔషధ గిరిగా చేస్తానని చేప్పిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. వికారాబాద్​ప్రాంతం మీకు ఏం నష్టం చేసింది కేసీఆర్.. అని కాంగ్రెస్​నేత అద్దంకి దయాకర్​ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చేంత దమ్ముందా మీకు అని విమర్శించారు. ఎంతో మంది నాయకులు వచ్చి పోతుంటారని, రాజ్యాంగం మాత్రం స్థిరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవ్​రెడ్డి, మాణిక్యారావు, మాజీ మంత్రి గీతారెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డి, అంజన్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.