సీపీఐకి కొత్తగూడెం సీటు.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు

సీపీఐకి కొత్తగూడెం సీటు.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐకి కొత్తగూడెం సీటుతో పాటు ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. చట్టసభల్లో వామపక్షాలు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, సీపీఐ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు రేవంత్. ఎన్నికల ప్రచారంపై సమన్వయ కమిటీని వేస్తామని చెప్పారు. 

హైదరాబాద్ లో CPI స్టేట్ ఆఫీస్ కు వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డితో చర్చించారు.  ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుపై అవగాహన కుదిరింది. ఐతే సీట్ల పంపకంపై డిస్కస్ చేశారు రేవంత్ రెడ్డి. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ సీటుతో పాటు అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసింది. దీనికి సీపీఐ నేతలు కూడా ఒకే చెప్పారు. 

మీటింగ్ అనంతరం రేవంత్ తో కలిసి నారాయణ, కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్బంగా మాట్లాడిన నారాయణ..  నెల క్రితం నిశ్చితార్థం.. ఇపుడు పెళ్లి జరిగిందన్నారు.  కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ను ఓడిస్తామన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సీట్లు ఎన్నిచ్చారనేదికాదని.. కేసీఆర్ నుంచి విముక్తి పొందాలన్నారు.