
ఓఆర్ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఆర్టీఐని సంప్రదించినా వారు స్పందించట్లేదని ఆయన ఆరోపించారు. దీంతో జులై 26న ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఓఆర్ఆర్లీజు టెండర్ల విషయంలో అధికార బీఆర్ఎస్ హస్తం ఉందని ఆయన పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ కూడా సమాచారం ఇవ్వకపోవడం.. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో హైకోర్టులో వేసిన పిటిషన్పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ALSO READ :సుప్రీంకు వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వండి..హైకోర్టులో వనమా పిటిషన్
ఆర్టీఐకి కమిషనర్లు లేకపోవడంతోనే సమాచారం రావడం లేదంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ని సీఎం కేసీఆర్ కుటుంబం పల్లీ బఠాణీల మాదిరి అమ్ముకుంటుందని రేవంత్గతంలో ఆరోపించారు.
గ్రోత్కారిడార్పరిధిలో ఉన్న ఓఆర్ఆర్ని హెచ్ఎండీఏ కిందకు మార్చడంలో ఉన్న మతలబు బయటపెట్టాలని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ బినామీలకు ఔటర్రింగు రోడ్డుని అమ్మే ప్రయత్నం జరుగుతోందని గతంలో ఆరోపించారు.