సుప్రీంకు వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వండి..హైకోర్టులో వనమా పిటిషన్

సుప్రీంకు వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వండి..హైకోర్టులో  వనమా పిటిషన్

భద్రాద్రి కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో లంచ్ మోషన్  పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళేంత వరకు హైకోర్టు తీర్పుపై  స్టే ఇవ్వాలని కోరారు.  ఇరువాదనలు విన్న హైకోర్టు..  తీర్పును రిజర్వ్ చేసింది. మరో వైపు  వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు పత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ కి అందజేశారు జలగం వెంకట్రావ్.

ALSO READ :హైకోర్టులో రేవంత్​ పిటిషన్.. ఎందుకంటే?    

 2018 ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని  జలగం వెంకట్రావు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు.  దీనిపై మూడేండ్ల వాదనల తర్వాత జులై 25న   హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.  ఆయనపై అనర్హత వేటు  వేయడంతో పాటు రూ. 5లక్షల జరిమానా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావే కొత్తగూడెం ఎమ్మెల్యే అని ప్రకటించింది.