
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2023 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రవాణా పైన వేసిన స్టాండింగ్ కమిటీకి సభ్యుడిగా పనిచేశారు. అంతే కాదు విద్యుత్, పునరుద్ధరణ శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సలహా సంఘం కమిటీ సభ్యుడిగాను పనిచేశారు. 2014 –16వ లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా .. టీడీపీ అభ్యర్థి అయినటువంటి నామా నాగేశ్వరరావు పైన 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వచ్చిన విబేధాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో పాలేరు అభ్యర్థిగా పోటీచేసి గెలుపొంది రేవంత్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేశారు.