
2018లో కొడంగల్ నియోజకవర్గంలో కుట్ర జరిపి తనను అన్యాయంగా పోలీసులే కిడ్నాప్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తరువాత సోనియాగాంధీ ఆశీస్సులతో దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీగా నన్ను గెలిపించారని రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ, అమిత్ షా నియోజకవర్గాల ఓటర్లను కలిపినా మల్కాజిగిరి కంటే తక్కువన్నారు. నేను అతితక్కువ కాలంలో కాంగ్రెస్ అధ్యక్షుడినయ్యానంటే దానికి ప్రజలే కారణమన్నారు.
కాంగ్రెస్ హయాంలో అనేక ఇరిగేషన్ నీటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. తెలంగాణలో 70 లక్షల ఎకరాలకు నీరందించామన్నారు. ఇప్పటి వెలుగులు, జిలుగులు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే అన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంగా మారిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే... ఈ రోజు బీఆర్ఎస్ నేతలు బిచ్చమెత్తుకొన్నే వారన్నారు. కేసీఆర్ చదువుకున్న చింతమడకలోని పాఠశాల కూడా కాంగ్రెస్ కట్టించేదనన్నారు.
మోడీ, కేసీఆర్ ఎప్పుడు నిజాలు చెప్పరని రేవంత్ అన్నారు. దేవేందర్ గౌడ్ హయాంలో కుత్భుల్లాపూర్ కానిస్టెన్సీ అభివృద్ది చెందిందన్నారు. మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.