వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి

వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయ్ : రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని, ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానే అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఏపని ప్రారంభించినా అవినీతి తాండవిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.  అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అడ్డగోలుగా అవినీతి జరిగిందని ఆరోపించారు.  ఒకే కంపెనీ ప్రతినిధులు మూడు టెండర్లు వేశారన్నారు.   ఇంకా కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

 సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.