
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్మండల పరిధి గాజులరామారంలోని మద్దెల చెరువులో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్అధికారులు శనివారం కూల్చివేశారు. చెరువులోని 8 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులు పట్టాభూమిగా చేసుకున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఆర్డీఓకు నిజాంపేట్బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు శనివారం చెరువులో నిర్మించిన గదులను, ప్రహారీ గోడను కూల్చివేశారు