15 నుంచి రెవెన్యూ సదస్సులు

15 నుంచి రెవెన్యూ సదస్సులు
  • ఒక్కో మండలంలో మూడు రోజులు మీటింగ్
  • ఎమ్మెల్యేల సారథ్యంలో వంద బృందాల ఏర్పాటు
  • 11న ప్రగతి భవన్​లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సీఎం మీటింగ్​

హైదరాబాద్ : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇంకా మిగిలివున్న భూ రికార్డుల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్​లో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవో ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే సారథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అవగాహన సదస్సు ఈ నెల 11వ తేదీన ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనుంది. ఈ సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాజరు కానున్నారు.