
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కోరిన ట్రెసా
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో పాటు కింద స్థాయి అన్ని కేడర్లలో పదోన్నతులు చేపట్టాలని ట్రెసా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తో వారు సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న వీఆర్వోలు, వీఆర్ఏల కారుణ్య నియామకాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.-- కమిషనర్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్, కమిషనర్ సర్వే అండ్ సెటిల్మెంట్, ప్రాజెక్ట్ డైరెక్టర్ భూభారతిగా నవీన్ మిట్టల్ అదనపు బాధ్యతలు చేపట్టడంపై ట్రెసా అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ సోమవారం నవీన్ మిట్టల్‌ను కలిసి సంతోషం వ్యక్తం చేశారు.