కృత్రిమ రక్తం తయారు చేస్తున్న దేశం:2030 నాటికి మెడికల్ షాపుల్లో కొనుక్కోవచ్చు..!

కృత్రిమ రక్తం తయారు చేస్తున్న దేశం:2030 నాటికి మెడికల్ షాపుల్లో కొనుక్కోవచ్చు..!

రక్త మార్పిడి చాలా కాలంగా ఎమర్జెన్సీ, ఆపరేషన్ సమయంలో చాలా కీలకంగా ఉంది. ఇలాంటి సమయంలో బ్లడ్ నిల్వ చేయడం, సరైన టైంకి అందించడం వంటివి చాలా క్లిష్టమైన ప్రక్రియ.రక్తమార్పిడికి సరైన బ్లడ్ గ్రూప్ దొరకాలి.. దానిని శుద్ది చేయాలి. ఇలా అనేక రకాల ప్రాసెస్ లుఉంటాయి. అయితే ఇన్ని ఇబ్బందులు ఎందుకు అనుకున్నారేమో గానీ జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఏకంగా కృత్రిమ బ్లడ్ నే తయారు చేస్తున్నారు. తయారీ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ కృత్రిమ రక్తం గనక అందుబాటులోకి వస్తే వైద్య చరిత్రలో మరో మైలురాయిని సాధించినట్లే. వివరాల్లోకి వెళితే..  

జీవితాన్ని పొడిగించడానికిరక్తం మానవ శరీరానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు ,వ్యర్థాలను రవాణా చేయడంలో సహాయపడుతుంది. రక్తం ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు ,ప్లాస్మా వంటి అంశాలతో కూడి ఉంటుంది. ప్రమాదంలో గాయపడినప్పుడు లేదా ఆపరేషన్ సమయంలో రక్తం అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో వివిధ రకాలగ్రూపులన్న రక్తం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ సమస్య తీరే సమయం వచ్చింది. రక్తం కొరతకు చెక్ పెట్టేందుక జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ  రక్తాన్ని తయారు చేస్తున్నారు. త్వరలో ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ అందుబాటులోకి రానుంది. 

జపాన్ లోని నారామెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ గొప్ప నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభించారు. అదే కృత్రిమ రక్తం తయారు చేయడం. ఈ కృత్రిమ రక్తం..ఇప్పుడున్న నమూనాలకంటే 24 రెట్టు ఎక్కువ లైఫ్ ను కలిగిఉంటుందట. ఈ బ్లడ్ గ్రూప్ ఒకటే ఉంటుంది. అన్ని రకాల బ్లడ్ గ్రూప్ లు ఉన్నవారికి ఎక్కించొచ్చు. అంటే ఈ కృత్రిమ బ్లడ్ అందుబాటులోకి వస్తే రక్తదాతలు డోనేట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదు. 

ఎలా తయారు చేశారు,..?

జపాన్ కు చెందిన నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమి సకాయ్, ఆమె టీం గడువు ముగిసిన రక్తం నుంచి హిమోగ్లోబిన్ ను తీసుకొని వైరస్ నిరోధక షెల్ లో ఉంచి కృత్రిమ రక్తాన్ని తయారు చేస్తారు. ఇది గడువు ముగిసిన డొనేట్ చేయబడిన బ్లడ్ ప్రయోజనాలను పెంచుతుంది. అంతేకాదు బ్లడ్ గ్రూప్ లతో సంబంధం లేకుండా అన్ని గ్రూపులకు ఈ కృత్రిమ రక్తం ఎక్కించొచ్చు.  ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్రభావం చాలా ఎక్కువ. ఈ సింథటిక్ రక్తాన్ని రెండేళ్ల వరకు నిల్వ చేయొచ్చు. ఈ రక్తం ఉదా రంగులో ఉంటుంది. 

►ALSO READ | వామ్మో ఇదో పెద్ద వాట్సప్ స్కాం..ఇమేజ్ డౌన్లోడ్ చేశారా..మీ బ్యాంకు ఖాతా ఖాళి అయినట్లే.

ఈ ఆవిష్కరకు సపోర్టుగా చువో యూనివర్సిటీ ప్రొఫెసర్ తెుయుకి కోమాట్స్ అనే శాస్త్రవేత్త  అండ్ టీ.. ప్లాస్మాలోని సాధారణ ప్రొటీన్ అయిన అల్బుమిన్ ఉపయోగించి బ్లడ్ ప్రెషర్ ,స్ట్రోక్స్ రాకుండా, రక్తస్రావం వంటి వాటికి చికిత్స చేసేందుకు కృత్రిమ ఆక్సిజన్ క్యారియర్లను రూపొందించారు. 

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..?

సకాయ్ ల్యాబ్‌లో ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.స్వచ్ఛంద కార్యకర్తలు 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని తీసుకుంటున్నారు. ఈ రక్తం సేఫ్, పవర్ ఫుల్ అని నిరూపితమైతే 2030 నాటికి జపాన్ అంతటా అమలు చేసే అవకాశం ఉంది.