వామ్మో ఇదో పెద్ద వాట్సప్ స్కాం..ఇమేజ్ డౌన్లోడ్ చేశారా..మీ బ్యాంకు ఖాతా ఖాళి అయినట్లే.

వామ్మో ఇదో పెద్ద వాట్సప్ స్కాం..ఇమేజ్ డౌన్లోడ్ చేశారా..మీ బ్యాంకు ఖాతా ఖాళి అయినట్లే.

అడ్వాన్స్ డ్ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ అదేస్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.రోజుకో తీరుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు,పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, కొత్త కొత్త టెక్నాలజీలు ఉపయోగిస్తున్నా..సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. గతంలో లింకులు, మేసేజ్ ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడిన ఫ్రాడ్ స్టర్లు తాజా ఇమేజ్ ద్వారా మెల్వేర్ పంపించి స్మార్ట్ ఫోన్ యూజర్ల బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. వివరాల్లో వెళితే.. 

వాట్సాప్ లో హానికరమైన లింకులు, ఫేక్ కాల్స్ లేదా మేసేజ్ ల ద్వారా మోసాలకు పాల్పడిన కేటుగాల్లు.. తాజాగా ఇమేజ్ సెండ్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలు దోచుకుంటున్నారు. 

జబల్ పూర్ లో జరిగిన ఓ షాకింగ్ ఘటనతో ఈ వాట్సాప్ ఇమేజ్ స్కాం బయటపడింది. జబల్ పూర్ కు చెందిన 28యేళ్ల వ్యక్తి వాట్సాప్ లో వచ్చిన ఒక సాధారణ ఫొటో డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత రూ. 2లక్షలు పోగొట్టుకున్నాడు. అతను సైబర్ స్కాంలో మోసపోయాడు. అయితే అతను అనుమానాస్పద లింకులో, ఫేక్ ఫోన్ కాల్స్ ద్వారానో డబ్బులు పోగొట్టుకోలేదు.. కేవలం ఒక ఫొటోను డౌన్ లోడ్ చేయడం ద్వారా ఖాతా ఖాళీ అయింది. 

ఫొటో డౌన్ లోడ్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుందా..ఎలా?

ఈ కొత్త ఫొటో స్కాంలో సైబర్ నేరగాళ్లు స్టెగానోగ్రఫీ అనే టెక్నిక్ ను ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణమైన ఫొటోలకు హానికరమైన కోడ్ జతచేసే వీలు కల్పిస్తుంది. ఫొటో డౌన్ లోడ్ అయిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా మాల్వేర్ మీ స్మార్ట్ ఫోన్ ఇన్ స్టా్ల్ అవుతుంది. ఇది పాస్ వర్డ్ లు దొంగిలించడం,  OTP లను రీడ్ చేయడం, హ్యాకర్లకు మీ బ్యాంక్ యాప్ లను యాక్సెస్ ఇచ్చేలా అనుమతిస్తాయి. దీంతో మీకు తెలియకుండా ఖాతాలు ఖాళీ అవుతాయి. 

Also Read : మిర్యాలగూడలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న యువతి అరెస్ట్

స్టెగానోగ్రఫీ ఎందుకంత ప్రమాదకరం?

ఈ రకమైన మాల్వేర్ చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే:

  • ఫొటో డౌన్‌లోడ్ చేసినప్పుడు ఇది కస్టమర్ ప్రమేయం అవసరం లేకుండా ఇన్ స్టాల్ అవుతుంది.
  • ఇది సెక్యూరిటీ టూల్స్ ను ఈజీగా తప్పించుకుంటుంది. 
  • ఇది బ్యాంకు ఖాతాను సైలెంట్ గా ఖాళీ చేయగలదు.
  • జబల్పూర్ కేసులో బాధితుడికి చాలా ఆలస్యం అయ్యే వరకు ఈ విషయం తెలియదు. ఏదో తప్పు జరిగిందని అతను గ్రహించే సమయానికి అతని బ్యాంకు ఖాతా నుండి రూ. 2 లక్షలు మాయమైపోయాయి.

వాట్సాప్ లో వచ్చేవి సేఫ్ ఫొటోలు అని ఎలా గుర్తించాలి?

  • ఆటో-డౌన్‌లోడ్‌ను నిలిపివేయాలి.. ఇందుకు  WhatsApp > సెట్టింగ్‌లు > స్టోరేజ్ ,డేటా > మీడియా ఆటో-డౌన్‌లోడ్‌కి వెళ్లి అన్ని సెలక్షన్లను ఆఫ్ చేయాలి. 
  • పంపిన వ్యక్తి మీకు తెలియకపోతే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.
  • కొత్తగా పరిచయం చేసుకునే యూజర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వారు మాత్రమే మిమ్మల్ని జోడించేందుకు గ్రూప్ సెట్టింగ్ చేసుకోవాలి. 
  • వాట్సాప్ లో ఎప్పుడూ సున్నితమైన సమాచారం పంచుకోవద్దు. అలా ఏదైనా పంచుకోవాలనుకుంటే తప్పనిసరిగా పర్సన్ ను నిర్ధారించుకుని షేర్ చేశారు. 
  • డేటా ,బ్యాంక్ ఖాతాలో డబ్బులు దొంగిలించడానికి ఒకే ఒక ఫొటో చాలు.  ఈ స్కామ్ ద్వారా సైబర్ ఫ్రాడ్ స్టర్లు  ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి.