సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వరవరరావుకు ట్రీట్‌‌మెంట్

సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వరవరరావుకు ట్రీట్‌‌మెంట్

మెహిదీపట్నం, వెలుగు:  విప్లవ కవి వరవరరావు కంటి పరీక్షల కోసం శనివారం మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ఆస్పత్రికి వచ్చారు.  ఓ కేసులో షరతులతో కూడిన బెయిల్‌‌పై బయటకు వచ్చి ముంబై లో ఉంటున్న ఆయన..  ఆరోగ్య సమస్యల కారణంగా  ఫ్లైట్ లో  హైదరాబాద్ చేరుకున్నారు.  కంటి చూపు సమస్యలు ఉన్నందున సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి చేరుకుని సూపరింటెండెంట్ రాజలింగంను కలుసుకున్నారు. 

ఆయన వరవరరావు కళ్లకు అన్ని రకాల టెస్టులు నిర్వహించి  వెంటనే సర్జరీ చేశారు.  వరవరరావుకు కంటి శుక్లం సర్జరీ చేశామని రాజలింగం తెలిపారు. ఆపరేషన్ విజయవంతం అయిందని  వెల్లడించారు.  ట్రీట మెంట్  అనంతరం మెడిసిన్  అందజేసినట్లు డాక్టర్లు తెలిపారు.