
రాష్ట్రంలో బీజేపీ వైపు వలసలు కొనసాగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఉన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు.. ఆయన అనుచరులు కూడా బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కూడా ఢిల్లీలో బీజేపీలో చేరారు.