
ఉద్యోగాలిచ్చామని చెబుతున్న ప్రభుత్వం చర్చకు వస్తే తప్పేముందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. చర్చకు రాకుండా తలసాని లాంటి దున్నపోతులను దాసోజు శ్రవణ్ పై ఉసిగొల్పడమేంటని అన్నారు. శ్రవణ్ వెనక ఎవరు లేరని కొంత మంది దున్నపోతులు విర్రవీగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శ్రవణ్ పై తలసాని ఇష్టానుసారం మాట్లాడితే ఈపులు విమానం మోత మోగుతాయన్నారు. కేటీఆర్ సమాధానం చెప్పలేక పారిపోయి… అచ్చోసు ఆంబోతులను శ్రవణ్ పై వదిలాడన్నారు. ఉధ్యమకారుడు దాసోజు శ్రవణ్ ను తలసాని గొట్టంగాడు అనడం ఎంటని ప్రశ్నించారు. ఉద్యమకారుడు ,విద్యావేత్త ప్రశ్నిస్తే తప్పేంటన్నారు. బలహీన వర్గాలను అవమాన పరిస్తే.. చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే.. కేటీఆర్ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడన్నారు.
టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే..ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను కూడా వాళ్ళు కొనుగోలు చేస్తారన్నారు. వెనకబడిన వర్గాలను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. దుబ్బాకలో సగం చీటీ చినిగిన హరీష్ కు ఈ ఎమ్మెల్సీఎన్నికల్లో పూర్తి చీటీ చినుగుతదన్నారు. ఎన్నికల ముందు ఈటెల ,ఎన్నికల తర్వాత హరీష్ పని అయిపోతుందన్నారు. నియామకాల విషయంలో ప్రభుత్వం నుంచి చర్చకు ఎవరు ఎక్కడికి వచ్చినా తాము చర్చ కు సిద్దమన్నారు.