చదువుకోడానికి వయసుతో పనిలేదు.. ఎప్పడైనా చదువుకోవచ్చు.. ప్రతిభను చాటుకోవచ్చని మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నిరూపించారు. 42 ఏళ్ల క్రితం వదిలేసిన చదువును ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టారు. ఇంటర్ లో మిగిలిన సబ్జెక్టు పరీక్షను ఇటీవల జరిగిన సప్లిమెంటరీ ఎగ్జామ్ లో రాసి పాసయ్యారు. అంతేకాదు లాసెట్ రాసిన దేవ్ జీ.. మంచి ర్యాంకుతో న్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల:ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రతిభ చాటారు.ఇటీవల జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్టు పరీక్ష రాసిన దేవ్ జీ.. 72 మార్కులతో పాసయ్యారు. దీంతో ఇంటర్మీడియట్ లో మొత్తం 614 మార్కులు సాధించారు. 42 ఏళ్ల క్రితం ఇంటర్ పరీక్షల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పిన దేవ్ జీ.. ప్రత్యేక అనుమతి అడ్వాన్స్ సప్లిమెంటర్ ఎగ్జామ్స్ రాశారు. చాలా కాలం గ్యాప్ తర్వాత కూడా దేవ్ జీ తన ప్రతిభను చాటుకున్నారు. దీంతోపాటు ఇటీవల రాసిన లాసెట్ లో కూడా 349 ర్యాంకు సాధించారు దేవ్ జీ. ఇంటర్ పాస్ కావడంతో ఐదేళ్ల న్యాయ విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించారు దేవ్ జీ.
►ALSO READ | కెమికల్స్ వాడితే 16 ఏళ్లకే భయంకరమైన రోగాలు.. .ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్
