ఫుడ్, ఈ కామర్స్, OTT పేమెంట్స్ పై వీసా డెబిట్, క్రెడిట్ కార్డు భారీ ఆఫర్స్..

ఫుడ్, ఈ కామర్స్, OTT పేమెంట్స్ పై వీసా డెబిట్, క్రెడిట్ కార్డు భారీ ఆఫర్స్..

రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు పేమెంట్ ఏదైనా ఇప్పుడు కార్డు ద్వారానే.. దేశంలో డిజిటల్ పేమెంట్స్ ప్రతి నెలా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. దీన్ని గమనించిన డెబిట్, క్రెడిట్ కార్డు కంపెనీలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. లేటెస్ట్ గా వీసా క్రెడిట్, డెబిట్ కార్డు సంస్థ భారీ ఒప్పందాలు చేసుకున్నది. వీసా ప్లాటినం, క్లాసిక్ కార్డులపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. 

ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జెప్టోలతోపాటు మీషో, ఇన్ స్టామార్ట్ వంటి సంస్థలతో భారీ ఒప్పందం చేసుకుంది. అదే విధంగా అబి బస్ తో డీల్ చేసుకుంది. అబి బస్ లో టికెట్ బుకింగ్ కు వీసా కార్డు ఉపయోగించినట్లయితే 200 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. 

ఇక లైఫ్ స్టయిల్, షాపర్స్ స్టాప్, మ్యాక్స్, లూలూ మాల్, మోర్ సూపర్ మార్కెట్స్, స్టార్ బజార్ వంటి రిటైల్ సూపర్ మార్కెట్లలో వీసా కార్డు చెల్లింపులపై భారీ ఆఫర్స్ ప్రకటించింది వీసా. షాపర్స్ స్టాప్ లో షాపింగ్ చేసి.. వీసా కార్డు ద్వారా చెల్లింపులు చేసినట్లయితే వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 

►ALSO READ | భారత్‌కు ఓపెన్‌డోర్ బై-బై: చెన్నై, బెంగళూరు ఆఫీసులు బంద్.. 250 మంది లేఆఫ్

OTT ప్లాట్ ఫామ్స్ విభాగంలోనూ ఆఫర్స్ ప్రకటించింది వీసా. సోనీలివ్, జీ 5 ఓటీటీలకు వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసినట్లయితే రెడిమ్ పాయింట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది వీసా. 

వీసా క్రెడిట్ కార్డు తీసుకునే కొత్త కస్టమర్లకు వెలకమ్ ఓచర్ కింద 250 రూపాయలు ఇవ్వటంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో ఉచితంగా లాంజ్ యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. 

ప్రస్తుతం దేశంలో ఉన్న 29 కోట్ల మంది వీసా డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ ప్రయోజనాలు అన్నీ అందుతాయని స్పష్టం చేసిన వీసా.. కన్స్యూమర్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలతో కొత్తగా చేసుకున్న ఒప్పందాల ద్వారా కస్టమర్లు అందరూ తమ రోజువారీ ప్రయోజనాలు పొందగలరని స్పష్టం చేసింది వీసా.