
కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ మరో బాంబ్ వేశాడు. లాక్ డౌన్ సమయంలో పలు సినిమాలు తీయబోతున్నట్లు ఫస్ట్ లుక్కులు రిలీజ్ చేసి, అందరినీ అయోమయం చేసిన వర్మ.. ఈ సారి ఏకంగా తన బయోపిక్కే తీస్తున్నట్లు చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఎందరో జీవితాలను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కూడా రాబోతోందంటూ.. వర్మ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపాడు. ఈ మూవీ మూడు భాగాలుగా ఉంటుందని… మూడు సినిమాలు కలిపి 6 గంటల నిడివి ఉంటుందని వెల్లడించారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిపారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాడు.