20 ఏళ్ళ తరువాత అమెరికాకు RGV

20 ఏళ్ళ తరువాత అమెరికాకు RGV

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma).. ఈ పేరు వింటేనే ఒక సెన్సేషన్.  తాజాగా వర్మ.. 'నేను  20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా వేడుకకి వెళ్తున్న' అంటూ  చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మహాసభలు ఈ నెల 30 నుంచి జూలై 2 వరకు అమెరికాలో జరగనున్నాయి. ఈ క్రమంలో RGV.. అమెరికా వెళ్తున్న అని చెప్పడంతో అందరి చూపు RGV వైపు తిరిగింది.  

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద తెలుగు మహాసభలు టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక అవ్వడంతో.. RGV ఏం మాట్లాడబోతున్నట్టు అందరి ఇంట్రెస్ట్ తన వైపు ఉండేలా చేశాడు. ' మీ తేజస్సును మ్రింగివేయడానికి మృగం వస్తోంది ' అంటూ RGV పెట్టిన ట్వీట్ తెగ ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ ఒక్క ట్వీట్ తో నాటా వేడుకలు ఎలాగైనా చూడాలని RGV ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

‘సాంస్కృతిక వికాసమే NATA  మాట.. సమాజసేవే NATA  బాట’ అనే నినాదంతో ఇప్పటివరకు అమెరికాలోని తెలుగు వాళ్ళు ఎన్నో సేవా కార్యక్ర­మాలు నిర్వహించిన సంగతి తెలిసేందే. కరోనా తర్వాత ఈ వేడుకలు ఆపేసారు. మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగి నిర్వహించడంతో చాలా మంది మన తెలుగు వాళ్ళు హాజరు అవుతున్నారని సమాచారం.