జ‌నాల‌కు సేవ చేసే ఉద్దేశం లేదు

V6 Velugu Posted on May 13, 2021

హైద‌రాబాద్- కాంట్ర‌వర్సీ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాడు. నిత్యం ఏదో కామెంట్ చేస్తూ వార్త‌ల్లో నిలిచే ఆర్జీవీ..ఈ సారి రాజ‌కీయంపై షాకింగ్ కామెంట్స్ చేసి, హాట్ టాపిక్ గా మారిపోయాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. అసలు రాజకీయాల్లోకి రానని.. జనాలకి సేవ చేయడం ఇష్టం లేదన్నాడు. ఎందుకంటే తనకు తాను సేవలు చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు వర్మ.  జనాలకు సేవ చేయాలనుకున్న వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని... నాకయితే అలాంటి ఉద్దేశం అసలు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కొంత మంది ఫేమ్, నేమ్ కోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తారని కానీ.. ప్రజాసేవ కోసం వచ్చాము అంటూ గొప్ప‌లు చెప్పుకుంటారు అంటూ.. ఆర్జీవీ మరోసారి తనదైన స్టైల్ కామెంట్స్ చేశాడు.

రెండ్రోజుల క్రితం చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాలపై ఈ విధంగా స్పందించాడు. ఇక‌ ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుందని వర్మ తెలిపాడు. తనకి తెలిసిన ఓ వ్యక్తితో కలిసి త్వరలోనే ఓటీటీని ప్రారంభిస్తున్నానని, మే 15న అది ప్రారంభం కానుందని చెప్పుకొచ్చాడు.

Tagged POLITICS, cinema, RGV,

Latest Videos

Subscribe Now

More News