
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma).. ఈ పేరు వింటేనే ఒక సెన్సేషన్. రీసెంట్ గా వర్మ.. 'నేను 20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా(NATA) వేడుకకి వెళ్తున్న' అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయినా విషయం తెలిసేందే. అమెరికా వెళ్లిన RGV ట్రిప్ ను చాలా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా RGV చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తుంది. "నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్ను ఎంతో బాగా హ్యాపీ గా సాగేలా చేశారు. అమెరికా నాకెంతో ఇష్టం. అలాగే అమెరికాకు కూడా నేనంటే ఎంతో ఇష్టం. అయితే ఫైనల్గా నా డ్రీమ్ అయిన డల్లాస్లోని (Dallas) బేబీ డాల్స్ పబ్కు (Baby Dolls Pub) వెళ్లాను. ఎంతో ఆనందంగా ఉంది. అని క్యాప్షన్ రాసుకొచ్చారు. పబ్ లో ఉన్న అమ్మాయిలతో సెల్ఫీ దిగి ఎంజాయ్ చేసినట్లు RGV ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
And AMERICA loves me tooooo ?? pic.twitter.com/DJ9ValFO33
— Ram Gopal Varma (@RGVzoomin) July 6, 2023
"ఈమె నిజమైనా వ్యక్తేనా లేదా బొమ్మనా అని చెక్ చేశాను.. ఫైనల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన అమ్మాయి అని రియలైజ్ అయ్యాను" అంటూ ఓ అమ్మాయిని తాకుతున్న ఫొటోను షేర్ చేశారు. అయితే వర్మ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన అమ్మాయి అని సరదాగా అన్నారు.
బేబీ డాల్స్ పబ్ లో ఉన్న అమ్మాయిలతో సెల్ఫీ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ RGV కేక అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు. ఈ పబ్ అమెరికాలో చాలా ఫేమస్ అని తెలిసిందే.
RGV ఏం చేసిన పూర్తీ భిన్నంగా, తనకు నచ్చినట్టుగా ఉంటాడు. అది చూసిన ఫ్యాన్స్ ఖుషి అవుతారు. RGV ప్రత్యేకతను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను సోషల్ మీడియా నుంచి పంచుకుంటున్నారు.