అమెరికాలో RGV నోట 'జై బాలయ్య' స్లోగన్

అమెరికాలో RGV నోట 'జై బాలయ్య' స్లోగన్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన పేరు. ఆ పేరు వెనుకాల ఉండే విజన్ చాలా అరుదు. రీసెంట్ గా 20 ఏళ్ళ తరువాత నాటా వేడుకల కోసం అమెరికా వెళ్ళాడు RGV. 

తాజాగా అమెరికా లోని తెలుగు వారికి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గోన్న RGV.. ఎంతో హుషారుగా వారితో గడిపాడు. అక్కడ టపాసులు కాల్చుతూ..  ఒక్కసారిగా నోటి వెంట జై బాలయ్య(Jai Balayya)  అనే స్లోగన్ రావడంతో..అక్కడ ఉన్న తెలుగు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా జై బాలయ్య అనే నినాదాలు చేశారు. ఇపుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.  వర్మ ఎలా ఎంజాయ్ చేస్తాడో మరోసారి వీడియోల ద్వారా అర్ధమవుతోంది. రామ్ గోపాల్ వర్మ అంటే ఎంత విభిన్నమైన వ్యక్తో అతను చాలా సార్లు బయటపెడుతూనే ఉంటారు.

వర్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ నేపథ్యంతో ఉన్న సినిమాలు ఎక్కువగా తీస్తున్న విషయం తెలిసేందే. ఇక రాంగోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyuham) కూడా సోషల్ మీడియా లో బాగానే హాట్ టాపిక్ గా నిలిచింది. సీఎం జగన్(CM Jagan) రాజకీయ జీవితంపై వస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.