మార్కెట్‌‌లో భగ్గుమంటున్న బియ్యం ధరలు

మార్కెట్‌‌లో భగ్గుమంటున్న బియ్యం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బియ్యం రేట్లు పెరిగాయి. ప్రస్తుతం శుభ కార్యాలు, పెండ్లిలు, ఫంక్షన్లు, దావతులు లేకున్నా... అన్ సీజన్లో కూడా బియ్యం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం ధరలు భారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బియ్యం రేట్లు పెరిగాయంటున్నారు  వ్యాపారులు. 25 కేజీల రైస్ బ్యాగుపై 150 నుంచి 200 రూపాయలు హైక్ అయిందని చెప్పారు. గత ఏడాది సోనా మసూరి క్వింటాల్ రైస్ బ్యాగ్ 3 వేల 700 రూపాయలు ఉండేది. ఇప్పుడు 4వేల 500కు పెరిగింది. HMT, ఆర్ఆర్, బుల్లెట్ రకాలు క్వింటాల్ రైస్ బ్యాగ్ 4 వేల రూపాయలు ఉండేవి. ప్రస్తుతం 5 వేలకు చేరింది. కర్నూల్ రైస్ 3 వేల 300 ఉంటే.... ఇప్పుడు 4 వేల 200 కు పెరిగింది. 

గత ఏడాది బాస్మతి రైస్ క్వింటాల్ 12 వేలు ఉంటే ప్రజెంట్ 13 వేల 500కు చేరింది. కిందటేడాది నూకలు, నాసిరకం బియ్యం 3 వేలు ధర పలికితే ఇప్పుడు 4 వేలు ఉందంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ లో బియ్యం ధరలు విపరీతంగా పెంచారని అంటున్నారు సిటీ జనం. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ నిత్యావసర ధరలతో పాటు బియ్యం రేట్లు కూడా పెరగడం భారంగా ఉందంటున్నారు. ధరలు ఇలా పెరిగితే బతకడం కష్టమవుతోందని చెప్తున్నారు సిటిజన్లు. GST పేరుతో ఎక్స్ ట్రా తీసుకుంటున్నట్టు తెలిపారు. మార్కెట్ లో ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వెల్లడిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.