
- ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: శాంతి చర్చలకు సిద్ధపడిన మావోయిస్టులు నంబాల కేశవరావుతో పాటు మరో 26 మందిని ఎన్కౌంటర్లో చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ చర్యను దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని గురువారం ఆయన ఓ ప్రకటనలో కోరారు. ఇప్పటికైనా ఎన్ కౌంటర్లు ఆపేసి మావోయిస్టులను శాంతిచర్చలకు పిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ కౌంటర్లు మరింత పెరిగాయన్నారు.