మోసపోయిన రిషబ్ పంత్..

మోసపోయిన రిషబ్ పంత్..

టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మోసపోయాడు. తోటి క్రికెటర్ చేతిలో దారుణ మోసానికి గురయ్యాడు. ఒక రూపాయి, రెండు రూపాయిలు కాదు అక్షరాలా రూ. 1.63 కోట్లు నష్టపోయాడు రిషబ్. తక్కువ ధరలకే బ్రాండెడ్ వాచ్లు ఇప్పిస్తానని హర్యానా క్రికెటర్ మృణాక్ సింగ్ రిషబ్ పంత్ దగ్గర రూ. 1.63 కోట్లు కొట్టేశాడు. 


పంత్కు మృణాక్ సింగ్  ఎలా తెలుసు..
లాస్ట్ ఇయర్  జోనల్ క్రికెట్ అకాడమీలో రిషబ్ పంత్ను మృణాక్ సింగ్ కలిశాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే తాను పార్ట్ టైమ్లో లగ్జరీ ఐటెమ్స్ బిజినెస్ చేస్తానని మృణాక్ సింగ్ పంత్ను నమ్మించాడు.  చాలామంది క్రికెటర్లకు  వాచీలు అమ్మినట్టు రిఫరెన్సులు కూడా చూపించాడు. చౌకధరలకే కాస్లీ వాచ్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. రిషబ్ పంత్ దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు, బంగారాన్ని అధిక ధరకు అమ్మి పెడతానని అతని నుంచి వస్తువులను తీసుకున్నాడు. రోజులు గడిచాయి. నెలలు దాటాయి. అయినా మృణాక్ సింగ్ నుంచి కబురు లేదు..కాసులు అందలేదు. పట్టరాని కోపంతో రిషబ్ పంత్ ..మృణాక్ సింగ్ మేనేజర్ను నిలదీశాడు. దీంతో మృణాక్ సింగ్ పంత్కు రూ. 1.63 కోట్లకు చెక్ రాసి ఇచ్చాడు. 

చెక్ బౌన్స్, పోలీసులకు ఫిర్యాదు..
మృణాక్ సింగ్ ఇచ్చిన చెక్‌ని బ్యాంక్‌లో వేయగా.. అతని అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో మరోసారి మోసపోయానని గ్రహించిన రిషబ్ పంత్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. 

పోలీసుల వివరాలతో పంత్కు మైండ్ బ్లాక్..
మృణాక్ సింగ్కు  మోసాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. అతను ఇలాంటి మోసాలు అనేకం చేశాడని పోలీసులు పంత్కు  తెలిపారు. ఇప్పటికే ఇదే తరహాలో రూ.6 ల‌క్ష‌ల‌కు  ఓ వ్యాపారవేత్తని మోసం చేసి.. ప్రస్తుతం ముంబయిలోని ఆర్థోర్ జైల్లో ఉన్నాడని వెల్లడించారు. అతడు ఓ సినిమా డైరెక్ట‌ర్‌ను కూడా మోస‌గించిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయని తెలిపారు. మృణాక్ సింగ్ అసలు రూపం బయటపడటంతో...పంత్ షాక్కు గురయ్యాడు. 

శాపంగా మారిన  పిచ్చి..
రిషబ్ పంత్కు కాస్లీ వాచీలు అంటే బాగా ఇష్టం. ఖరీదైన వాచ్లను పెట్టుకుని తెగ మురిసిపోతుంటాడు.  పంత్ దగ్గర ఫ్రాంక్ ముల్లర్ వాన్ గార్డ్ యాచ్ కింగ్ సిరీస్కు చెందిన వాచ్ను ఉంది. దాని ధర రూ. 36 లక్షల 25 వేలు.  62 లక్షల 60వేల విలువ గల రిచర్డ్ మిల్లే వాచ్ కూడా ఉంది. వీటిని మరింత అధిక ధరకు అమ్మిపెట్టాలని మృణాంక్ సింగ్కు అప్పగించాడు. అప్పనంగా మోసపోయాడు. అందుకే అంటారు పెద్దలు దురాశ దు:ఖానికి చేటు అని.