మేం మంచి దోస్తులం..మా మధ్య పోటీ పెట్టొద్దు

మేం మంచి దోస్తులం..మా మధ్య పోటీ పెట్టొద్దు

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​, తాను మంచి ఫ్రెండ్స్​ అని కేరళ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్​ అన్నాడు. ఆట పరంగా తమ మధ్య పోటీ పెట్టొద్దని, టీమ్ అవసరాలకు అనుగుణంగానే జట్టులో చోటు ఉంటుందన్నాడు. తన డెబ్యూ తర్వాత వచ్చిన బ్రేక్..​ ప్లేయర్​గా తాను ఎదగడానికి ఎంతో సహాయపడిందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్​, డొమెస్టిక్​ క్రికెట్​ ఆడటం నాకు బాగా కలిసొచ్చింది. ఈ టైమ్​ నా కెరీర్​లో, జీవితంలో చాలా ముఖ్యమైంది. నా గేమ్​ను క్రమంగా మార్చుకున్నా. మానసికంగా చాలా స్ట్రాంగ్​ అయ్యా. నా గురించి నేను తెలుసుకున్నా. నా బలం, బలహీనతలనూ గుర్తించా. ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్​కు సరిపోయే స్థాయిలో నా ఆటను మల్చుకున్నా’ అని శాంసన్​ పేర్కొన్నాడు. వికెట్​ కీపర్​గా టీమ్​లో చోటు కోసం పంత్​తో పోటీపడాల్సి వస్తున్న నేపథ్యంలో .. తమ ఇద్దరి మధ్య ఆ సందర్భం రాలేదన్నాడు. ‘టీమ్​ కాంబినేషన్​పై అన్నీ ఆధారపడి ఉంటాయి. పంత్​తో కాంపిటీషన్​ అనే అంశాన్ని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రిషబ్​, నేను ఐపీఎల్​లో ఢిల్లీ డేర్​డెవిల్స్​కు ఆడాం. ఇద్దరం కలిసి చాలా టైమ్​ స్పెండ్​ చేశాం. మేం మంచి ఫ్రెండ్స్​ కూడా. పంత్​ చాలా టాలెంటెడ్​ ప్లేయర్​. గుజరాత్​తో జరిగిన ఓ మ్యాచ్​లో మేమిద్దరం సిక్సర్ల వర్షం కురిపించాం. 200 టార్గెట్​ను ఛేజ్​ చేశాం. ఆ పార్ట్​నర్​షిప్​ మాకు ఇంకా గుర్తుంది’ అని శాంసన్​ చెప్పుకొచ్చాడు.

కోహ్లీని మించిన మొనగాడు లేడు