SA vs IND: రెండు మ్యాచ్‌లకు రెండు వేర్వేరు జట్లు: సౌతాఫ్రికా ఏ తో టెస్ట్ సిరీస్.. ఇండియా ఏ కెప్టెన్‌గా పంత్

SA vs IND: రెండు మ్యాచ్‌లకు రెండు వేర్వేరు జట్లు: సౌతాఫ్రికా ఏ తో టెస్ట్ సిరీస్.. ఇండియా ఏ కెప్టెన్‌గా పంత్

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన రిషబ్ సఫారీలతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. టెస్ట్ సిరీస్ కంటే ముందు సౌతాఫ్రికా ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా ఏ జట్టుతో   ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు ఇండియా ఏ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను సెలక్ట్ చేశారు. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ రెండు జట్లను మంగళవారం (అక్టోబర్ 21) ప్రకటించింది. 

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మ్యాచ్ లు జరుగుతాయి. ప్రస్తుతం ఇండియా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టూర్ లో భాగంగా మొత్తం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తొలి టెస్టుకు ఇండియా రెగ్యులర్ టెస్ట్ జట్టు అందుబాటులో లేకపోయినా రెండో టెస్ట్ ఆడనున్నారు. రెండు టెస్టులకు సెలక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. రెండో మ్యాచ్ లో 
 కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడతారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అక్టోబర్ 25 నాటికి ముగిసిన తర్వాత వీరు స్వదేశానికి తిరిగి వస్తారు. సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 

సౌతాఫ్రికా ఏ తో మొదట మ్యాచ్‌కు భారత ఎ జట్టు:

రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ ( వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ జక్ థక్‌బోజ్, యాష్రన్ కాంబోజ్, యాష్రన్ కాంబోజ్, సయష్రన్ కాంబోజ్.

సౌతాఫ్రికా ఏ తో రెండో మ్యాచ్‌కు భారత ఎ జట్టు: 

రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్ , ప్రమాన్ అహ్మద్, ప్రమాన్ అహ్మద్, ప్రమాన్ అహ్మద్ మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.

ఇంగ్లాండ్ సిరీస్ లో పంత్ కు గాయం:

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన పంత్ సర్జరీ నుంచి తప్పించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్.. ఓవల్ లో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో మొదట సర్జరీ అవసరమని భావించినా.. ఆ తర్వాత ఆ అవసరం లేదని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అయితే గాయపడిన పంత్ కు 6 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో పంత్ సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ తో పాటు అక్టోబర్ లో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వైట్ బాల్ టూర్ కు దూరమయ్యాడు.