రిషబ్ పంత్‌‌కు ఆరో ర్యాంక్‌‌

రిషబ్ పంత్‌‌కు ఆరో ర్యాంక్‌‌

టీమిండియా వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌.. ఐసీసీ టెస్ట్‌‌ ర్యాంకింగ్స్‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో ఒక్క ప్లేస్‌‌ ఎగబాకిన పంత్‌‌ (801) ఆరో ర్యాంక్‌‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి టెస్ట్‌‌లో రెండు ఇన్నింగ్స్‌‌ల్లో సెంచరీలు చేయడం ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 

2022లో ఇదే సమయంలో పంత్‌‌ కెరీర్‌‌ అత్యుత్తమ ర్యాంక్‌‌ (5)లో ఉన్నాడు. ఇక ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ (851) నాలుగో ర్యాంక్ నిలబెట్టుకోగా, జో రూట్‌‌ (889), హ్యారీ బ్రూక్‌‌ (874), విలియమ్సన్‌‌ (867) టాప్‌‌–3లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌‌లో బుమ్రా (907) టాప్‌‌ ప్లేస్‌‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లండ్‌‌పై తొలి టెస్ట్‌‌లో ఐదు వికెట్లు తీయడంతో ర్యాంక్‌‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. కగిసో రబాడ (859), కమిన్స్‌‌ (846), హాజిల్‌‌వుడ్‌‌ (817) వరుసగా రెండు నుంచి నాలుగు ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. టెస్ట్‌‌ ఆల్‌‌రౌండర్స్‌‌ లిస్ట్‌‌లో రవీంద్ర జడేజా (376) టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు.